తెలంగాణ

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేకాటలో 125 కేసులలో 649 మంది, రూ॥ 13,07,380=00 స్వాదీనం: పోలీస్ కమిషనర్ వెల్లడి*.

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేకాటలో 125 కేసులలో 649 మంది, రూ॥ 13,07,380=00 స్వాదీనం: పోలీస్ కమిషనర్ వెల్లడి*.

పయనించే సూర్యుడుD.09.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్బంగా తేది: 07-11-2026 నుండి తేది: 09-11-2026 నాడు ఉదయం 11 గంటల వరకు పేకాట ఆడుతున్న వారిని ఈ దిగువ తెలిపిన విధంగా డివిజన్ల వారిగా కేసులు నమోదు చేయడం జరిగింది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 125 కేసులు నమోదు చేయడంతో పాటుగా మొత్తం రూ॥ 13,07,380=00 స్వాధీనం చేసుకోవడం జరిగిందని * నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., తెలిపారు. పూర్తి వివరాలు ఈ దిగువ విధంగా వున్నాయి.1. నిజామాబాద్ డివిజన్ లో మొత్తం కేసులు 29 , పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులు 175 మంది , మొత్తం రూపాయలు 5,25,370=00/-2. ఆర్మూర్ డివిజన్ లో మొత్తం కేసులు 26 , పేకాట ఆడుతూ పట్టుబడిన మొత్తం 131 మంది , మొత్తం రూపాయలు 2,20,760=00/- .3. బోధన్ డివిజన్ లో మొత్తం కేసులు 70 , పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులు 343 మంది , మొత్తం రూపాయలు 5,61,250=00/-🔹 మూడు డివిజన్ ల మొత్తం కేసులు 125🔹 మూడు డివిజన్ లో పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులు మొత్తం 649 మంది🔹 మూడు డివిజన్ ల పట్టుబడిన మొత్తం రూపాయలు 13,07,380=00/-దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలపై నియం త్రించడానికి ప్రత్యేక నిఘా , ప్రత్యేక టీం మరియు కంట్రోల్ రూం ఏర్పాటుచేయడం జరిగింది.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS