సినిమా వార్తలు

మోర్తాడ్ ప్రజానిలయంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మోర్తాడ్ ప్రజానిలయంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన  వేడుకలు.

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మోర్తాడ్ ప్రజానిలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS