తెలంగాణ

ఎంపీ హేమంగ్ జోషి కి స్వాగతం పలికిన కుమార్ యాదవ్

ఎంపీ హేమంగ్ జోషి కి స్వాగతం పలికిన కుమార్ యాదవ్

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ పర్యటనకు విచ్చేసిన బిజెపి యువమోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు హేమంగ్ జోషి ని హైదరాబాద్ లో బిజెపి యువ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం తెలపడం జరిగింది. అనంతరం కుమార్ యాదవ్ హేమంగ్ జోషి, రాజ్యసభ డాక్టర్ లక్ష్మణ్ యువమోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి మిట్ట వంశీ, ఉపాధ్యక్షురాలు కోమలి నాయక్, ఈటల క్షమిత, గణేష్, సింధు మరియు ఇతర నాయకులతో కలిసి గండిపేట లో బ్యాడ్మింటన్ క్రీడాకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ నషాముక్త భారత్ గా తీర్చిదిద్దడం కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న కృషిలో భాగంగా యువమోర్చా కూడా కీలకంగా పనిచేస్తుంది అన్నారు. యువత చెడు దారిన పడకుండా ఉన్నత ఆశయం వైపు వెళ్లడం కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని అన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS