తెలంగాణ

అనుబంధాల వేడుక భగినీ హస్త భోజనం

అనుబంధాల వేడుక భగినీ హస్త భోజనం

పయనించే సూర్యుడు నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి నవంబరు 11: కార్తీక శుద్ధ విదియ సందర్భంగా బుధవారం భగినీ హస్త భోజనం వేడుక అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఇళ్లలో ఎంతో సంబరంగా సాగింది. సోదరులు సోదరి ఇంటికి చేరుకుని ఆమె ఆప్యాయంగా వండిన వంటకాలను సంతోషంగా స్వీకరించారు. ఈ సందర్భంగా సోదరీలు సోదరునికి పసుపు, కుంకుమ, పళ్లు, రకరకాల స్వీట్లు అందించి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు చేకూరాలని మనసారా కోరుకున్నారు. సోదరులు కూడా సోదరికి చీర, కానుకలు, పళ్లు, స్వీట్లు అందజేసి తమ ప్రేమను చాటుకున్నారు. సోదరికి కానుకలు ఇస్తున్న సోదరుడు. సోదరుడికి భోజనం వడ్డిస్తున్న సోదరి. కుటుంబమంతా ఒకచోట చేరి నవ్వులు, ముచ్చట్లతో ఆనందంగా గడిపారు. ఈ వేడుక తోబుట్టువుల మధ్య ఆప్యాయతను మరింత పెంచిందని పలువురు చెప్పారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS