పయనించే సూర్యుడుD.12.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.సుప్రీంకోర్టు ప్రైవేట్ వైద్యంపై ఇచ్చిన తీర్పు అమలులో జిల్లా అధికారుల నిర్లక్ష్యం!సిరికొండ మండల కేంద్రంలోని 532 సర్వే నంబర్ భూములు, ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో హైకోర్టు తీర్పును ఉల్లంఘించిన జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలి!నిజామాబాద్:కోర్టు ధిక్కరణకు పాల్పడిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి శిక్ష పడటం సరైనదే. అయితే, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నిజామాబాద్ జిల్లా స్థాయి అధికారుల విషయంలో ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ఎందుకు స్పందించడం లేదని CPI(ML) మాస్ లైన్ ప్రశ్నించింది.సుప్రీంకోర్టు ప్రైవేట్ వైద్యానికి సంబంధించి ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో జిల్లా స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అలాగే సిరికొండ మండల కేంద్రంలోని 532 సర్వే నంబర్ భూముల సమస్య, ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం అధికారులు ఉల్లంఘిస్తున్నారని పార్టీ నాయకులు విమర్శించారు.ఈ అంశాలపై గురువారం నిజామాబాద్ లోని NR భవన్ (CPI(ML) మాస్ లైన్ పార్టీ కార్యాలయం)లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్మీట్లో నాయకులు మాట్లాడుతూ జిల్లా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సిరికొండ 532 సర్వే నంబర్ భూముల విషయంలో కోర్టు తీర్పును అమలు చేయాలి సిరికొండ మండల కేంద్రంలోని 532 సర్వే నంబర్‌కు సంబంధించిన భూములకు 2009లో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ భూములకు సంబంధించి బాధితులు న్యాయపోరాటం చేయగా, 2012లో కోర్టు లబ్ధిదారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ, అప్పటి నుంచి నేటి వరకు సమస్యను పరిష్కరించడం లో జిల్లా స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కోర్టు తీర్పును అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని నాయకులు విమర్శించారు. కోర్టు తీర్పు వెలువడి ఇన్నేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు న్యాయం జరగకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. తక్షణమే కోర్టు తీర్పును అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంకాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అక్రమాలు – హైకోర్టు తీర్పును అమలు చేయాలి.ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన 96 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తయ్యాయి. వీటిలో 92 ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు కేటాయించి, మిగిలిన నాలుగు ఇళ్ల పంపిణీని నిలిపివేశారు.ఇళ్లను కేటాయించిన 92 మందిలో 22 మంది అనర్హులు, సంబంధిత గ్రామానికి చెందని వారికి సైతం ఇళ్లు కేటాయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అర్హులైన నలుగురికి ఇళ్లను కేటాయించకుండా నిలిపివేశారు.దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా, నలుగురికి తక్షణమే ఇళ్లు కేటాయించాలని, ఇళ్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.అయితే హైకోర్టు ఆదేశాలు వెలువడి ఇంతకాలం గడుస్తున్నా సంబంధిత అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం విచారకరమని నాయకులు అన్నారు. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా అధికారులు వ్యవహరించడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని విమర్శించారు.జిల్లా అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి ఒవైపు కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వాలు, మరోవైపు న్యాయస్థానాల తీర్పులను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న జిల్లా స్థాయి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని CPI(ML) మాస్ లైన్ నాయకులు ప్రశ్నించారు.సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను అధికారులు గౌరవించి తక్షణమే అమలు చేయాలని, సిరికొండ 532 సర్వే నంబర్ భూముల సమస్యను పరిష్కరించాలని, అంకాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని, అనర్హులకు కేటాయించిన ఇళ్లపై చర్యలు తీసుకోవాలని, అర్హులైన నలుగురు లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.అలాగే కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ, అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత జిల్లా స్థాయి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ ప్రెస్మీట్లో CPI(ML) మాస్ లైన్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి V. ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి B. దేవారం, జిల్లా నాయకులు R. రమేష్ ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు M. ముత్తెన్న, ఆర్మూర్ మండల సంయుక్త కార్యదర్శి B. కిషన్, V. సత్తెవ్వ, AIUKS జిల్లా ప్రధాన కార్యదర్శి B. బాబన్న, ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి R. దామోదర్, PYL మండల నాయకులు T నరేష్, సిరికొండ, అంకాపూర్ లబ్ధిదారులు, బాధితులు M పండరి, జహిరబీ, M సుశీల, ఒడ్డె నాగయ్య, MD రపిక్, తదితరులు పాల్గొన్నారు.