సినిమా వార్తలు

తెలంగాణ సారస్వత పరిషత్ సాహిత్య పోటీలలో ఏర్గట్ల విద్యార్థికి బహుమతి.

తెలంగాణ సారస్వత పరిషత్ సాహిత్య పోటీలలో ఏర్గట్ల విద్యార్థికి బహుమతి.

పయనించే సూర్యుడుD.12.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలో ఏరుగట్ల మండల కేంద్రంలోఎరుగట్ల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రాజేష్ నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సారస్వత పరిషత్ వారు నిర్వహించిన జాతీయస్థాయి సాహిత్య పోటీలలో ఏరుగట్ల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పెరక రాజేష్ పద్య కవితా విభాగంలో జాతీయస్థాయి మూడవ బహుమతిని, గేయం విభాగంలో ప్రోత్సాహక బహుమతిని గెలుచుకున్నాడని పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు.
నవంబర్ 22 తేదీన హైదరాబాదులోని సారస్వత పరిషత్ సమావేశ మందిరంలో జరిగే బహుమతి ప్రధానోత్సవం లో పెద్దల చేతుల మీదుగా నగదు బహుమతిని, జ్ఞాపిక ప్రశంసా పత్రాన్ని విద్యార్థి అందుకుంటాడని తెలిపారు.జాతీయస్థాయిలో బహుమతి గెలుచుకున్న రాజేష్ ను పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి అభినందించారు.. భవిష్యత్తులో సాహిత్య రంగంలో ఉన్నత స్థానంలో ఉండాలని తెలిపాడు. జాతీయస్థాయిలో బహుమతి అందుకున్న రాజేష్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS