
పయనించే సూర్యుడుD.14.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండల కేంద్రంలో లింబాద్రిగుట్ట జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శుభ్రత చర్యలు భీంగల్: లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా ఆర్మూర్ సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ & పాలకవర్గం ఆదేశాల మేరకు లింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ తెలిపారు.ఈ సందర్భంగా గుట్టపై డివైడర్ల వెంబడి పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు రహదారులన్నింటినీ శుభ్రం చేయడం, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను తొలగించడం, రోడ్లపై స్వీపింగ్ పనులు చేపట్టడం జరిగిందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.