ముఖ్య అతిధులుగా ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తొండ రవి ,ప్రధాన కార్యదర్శి దాసి నాగరాజు నూతనంగా ఎన్నికైన ఎస్సీ మోర్చ జిల్లా కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన అధ్యక్షుడు విట్యాల నరసింహ ( పయనించే సూర్యుడు నవంబర్ 16 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి రూరల్ జిల్లా ఎస్సీ మోర్చ కార్యవర్గ సమావేశం షాద్ నగర్ లో ఎస్సీ మోర్చ అధ్యక్షుడు విట్యాల నరసింహ అధ్యక్షతన జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ మోర్చ ఉపాధ్యక్షులు తొండ రవి ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి నాగరాజు మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) జరుపుకుంటారు,1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించింది,కేంద్ర ప్రభుత్వం నవంబర్ 19, 2015న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ను ‘రాజ్యాంగ దినోత్సవం’గా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు,దానిలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చ ఆధ్వర్యంలో 26 నవంబర్ రోజున ర్యాలీ నిర్వహించి, పౌరులలో ముఖ్యంగా యువతలో రాజ్యాంగ విలువలు,ప్రాథమిక హక్కులు మరియు కర్తవ్యాలపై అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం అని తెలియజేశారు,ఆలాగే నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు,వారికి పార్టీ నీ SC లకు మరింత చేరువచేయాలని సూచించారు,ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు బోసుపల్లి ప్రతాప్ ,సీనియర్ నాయకులు కొండ్రు పురుషోత్తం, నూతన SC మోర్చ రంగారెడ్డి రూరల్ జిల్లా కార్యవర్గ సభ్యులు,సీనియర్ నాయకులు పాల్గొన్నారు.