ఆంధ్రప్రదేశ్

బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన గృహప్రవేశం.

బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన గృహప్రవేశం.

పయనించే సూర్యుడుD. 16.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం
బాల్కొండ మండల కేంద్రంలోని నెహ్రు నగర్ కాలనీ చెందిన బోజిగోళ్ల గంగమణి నూతన ఇందిరమ్మ గృహాన్ని సోమవారం బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించి గృహ ప్రవేశం చేశారు.ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేదల కళ సాకారం అవుతుందని, కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని వారు అన్నారు. పేదల గృహ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ5 లక్షలు మంజూరు చేస్తున్నారని వారు తెలిపారు.అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతున్నాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిపొందిన కుటుంబ సభ్యులు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సునీల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచి గాండ్ల రాజేష్, పంచాయతీ కార్యదర్శి మోహన్, పట్టణ అధ్యక్షుడు కుందారం శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిలు మహమ్మద్ యూనిస్,సంజీవ్ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శిలు పుప్పాల విద్యా సాగర్, పుల్లాయి నవీన్, సయ్యద్ రియాజ్ అలీ, మండల కార్యదర్శిలు గడ్డం రవి, మాజీ సర్పంచి తౌట్ గంగాధర్, వార్డు సభ్యులు పిట్ల సాయి చరణ్ తేజ, రహీమ్, తెడ్డు సందీప్, పార్టీ నాయకులు దోన్ పాల్ సాయన్న, తెడ్డు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS