ఆంధ్రప్రదేశ్

నేల ఆరోగ్య పరిరక్షణతోనే సంపన్న రైతు సాధ్యం

నేల ఆరోగ్య పరిరక్షణతోనే సంపన్న రైతు సాధ్యం

డాక్టర్ అనూష చింతగూడలో రైతులకు ఖేత్ బచావో కార్యక్రమంపై అవగాహన ( పయనించే సూర్యుడు నవంబర్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) గ్రామ పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ మెక్కొండ నరేష్ ఆధ్వర్యంలో ఖేత్ బచావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యకరమైన నేల – సంపన్న రైతు అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ అనూష రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సమతుల, సహజ ఎరువుల వినియోగం పెంచాలని సూచించారు. నేల పరీక్షలు చేయించి, పరీక్ష ఫలితాల ఆధారంగానే ఎరువులు వినియోగించాలని తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చకుండా నేలలో కలిపి సేంద్రియ ఎరువుగా మార్చుకోవాలని సూచించారు. వరి పంటతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలను సాగు చేస్తూ పంటల మార్పిడిని ప్రోత్సహించాలని వివరించారు. నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ ‘ప్రతి చుక్కకు మరింత పంట’ అనే విధానాన్ని రైతులు ఆచరించాలని సూచించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా భూసారం పెంపొందించుకోవడంతో పాటు రైతులు అధిక దిగుబడులు సాధించే అవకాశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వి. శంకరయ్య, మాజీ సర్పంచ్ ఆనంద్, భగవంత్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి రాంబాబు, పంచాయతీ కార్యదర్శి వీరభద్రప్పతో పాటు 56 మంది రైతులు పాల్గొన్నారు..

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS