పయనించే సూర్యుడు నవంబర్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా శుక్రవారం ఉదయం గొల్లపల్లి అమూల్య ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ అమూల్యను జిల్లాకు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు, ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ మోకా వెంకట సుబ్బారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్యవరప్రసాద్, బొర్రా వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు, గంధం శ్రీనివాస పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొని అమూల్యకు అభినందనలు తెలిపారు.