పసుపు పండగ ‘లా డిజిటల్ మహానాడు ముమ్మిడి వరంలో టిడిపి శ్రేణుల కోలాహలం.

May 28, 2026 | సినిమా వార్తలు

పయ నించే సూర్యుడు మే 28 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి వరం. తెలుగువారి పండగ మహానాడు నినాదంతో తెలుగుదేశం పార్టీ 44వ వార్షిక మహాసభలను ముమ్మిడివరంలో క్లస్టర్ -3 రెండవ రోజు డిజిటల్ విధానములో అట్టహాసంగా నిర్వహించారు ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో క్లస్టర్ -3 హైబ్రిడ్ మహానాడు వేడుకలు పండగ వాతావరణం తలపించాయి.ఈరోజు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి, నియోజకవర్గ పరిశీలకులు సుంకరి పావని,ముమ్మిడివరం పోలమ్మ చెరువు గట్టున ఉన్న నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తదుపరి క్లస్టర్ -3 డిజిటల్ మహానాడు ఎస్ వి ఎస్ ఫంక్షన్ హాల్ నందు జరుగు డిజిటల్ మహానాడులో ఎమ్మెల్యే బుచ్చిబాబు అమలాపురం ఎంపీ హరీష్ మధు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మహానాడు ప్రధాన సభలను వారి ప్రసంగాలను నియోజకవర్గంలో కార్యకర్తలు అభిమానులు నేరుగా వీక్షించేలా డిజిటల్ స్క్రీన్ ల( Led Screens) ద్వారా ముమ్మిడివరం నియోజకవర్గంలో విస్తృతముగా ఏర్పాటు చేశారు, తెలుగుజాతి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు మహానాడు ఒక పండగ లాంటిదని కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి మాట్లాడుతూ మహానాడు అంటే ఒక పండగ వాతావరణం లాంటిదని ముమ్మిడివరం నియోజకవర్గంలో బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలో టిడిపి మహానాడు వేడుకలు అట్టహాసంగా జరిగాయని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి ప్రతి వార్డులలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేలా విజయ పతాకంలో ముందుకు సాగేలా కార్యకర్తలు పనిచేయాలని ప్రభుత్వం పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు.నియోజవర్గ పరిశీలకులు సుంకరి పావని మాట్లాడుతూ ఈ మహానాడు థీమ్ శ్రీ శక్తి దీని పరంగా మన ముఖ్యమంత్రివర్యులు అదేవిధంగా మన యువ నాయకులు లోకేష్ బాబు మహిళలు అభివృద్ధి చెందాలి రేపు రాబోయే ఎలక్షన్లలో మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించటం పట్ల మహిళలు అందరి తరపున వారిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్టీఆర్ ఆశయాలు ఆచరణలో పెడుతున్న నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లoరాజు, తాడి నరసింహారావు,దాట్ల పృధ్విరాజ్, దొమ్మేటి రమణ కుమార్, కట్ట సత్తిబాబు, ములపర్తి బాలకృష్ణ, సుంకరి పావని తిరుమల కుమార్, పిల్లి నాగరాజు, అడబాల సతీష్ కుమార్, సరిపెల్ల శ్రీనివాసరాజు, గొల్లపల్లి గోపి, కడలి నాగు, కాశి లాజర్,నిమ్మకాయల విషు, దివి విజయ్, బొక్క రుక్మిణి, వాసంశెట్టి అమ్మాజీ, కుడిపూడి మల్లేశ్వరి, పెదపూడి రుక్మిణి, అత్తిలి ప్రసన్న కుమారి, రెడ్డి సుబ్బారావు, జెడి, బొబ్బిలి, కాకి మాణిక్యం, కటికతల నాని, కుమార్ రాజు,విల్లా వీరాస్వామి నాయుడు,సానబోయిన సోమయ్య, పితాని రాము, లోకనీడు వెంకటేశ్వర రావు, ఎస్ఎంఎస్ ప్రసాద్, పాయసం చిన్ని, నడింపల్లి శ్రీనివాసరాజు, జాగు సత్తిబాబు మాదాల పరంకుశం, మాదంశెట్టి గుప్తా, చింతలపూడి బాబురావు, ఏడిద శివశంకర్, కనుమూరి శివరాజ్, పితాని రాము, గడ్డం శ్రీనివాసరావు, గంజా వెంకటేశ్వరరావు, దివి తేజ, చప్పిడి ప్రసాద్, దాసు, రెడ్డి శ్రీను, మొదలగువారు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper