
రుద్రూర్, అక్షర ఆయుధం న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలోని కందూర్ గల్లీలో పోత లింగయ్య స్వామి ఆలయంలో గురువారం పోతలింగయ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. వేద పండితులచే గణపతి పూజ, రక్షాబంధన్, గోపూజ, యంత్ర ప్రతిష్ట, అఖండ దీపస్థాపనం, మహా పూర్ణాహుతి, యజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు చేపట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.