మురుమళ్ళ క్యాంప్ ఆఫీసులోప్రజా సమస్యల ప్రజా వేదిక కార్యక్రమం

May 29, 2026 | ఆంధ్రప్రదేశ్

ప య నించే సూర్యుడు మే 29 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ళ శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. వెంటనే పరిష్కారం చూపగలిగే సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించడంతో పాటు, మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి , ఐ పోలవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ సాగిరాజు సూరిబాబు రాజు , జనసేన నాయకులుగుద్దటి జిమ్మి , తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper