రైతు నుండి ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది

May 30, 2026 | సినిమా వార్తలు

*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

*మార్కెట్ యార్డ్ అభివృద్ధిపై పాలకవర్గ సమీక్షా సమావేశం*

*రైతు సంక్షేమంపై దృష్టిని సాధించాలని సూచన*

( పయనించే సూర్యుడు మే 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో షాద్ నగర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి అధ్యక్షతన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మార్కెట్ సెక్రటరీ, కమీషన్ ఏజెంట్లతో షాద్ నగర్ మార్కెట్ యార్డ్ అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శనివారం నిర్వహించారు. మార్కెట్ యార్డులో ధాన్యం విక్రయానికి వచ్చే రైతుల వద్ద నుండి ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం మార్కెట్ మద్దతు ధర కంటే ఎక్కువగా చెల్లించి కొనడం శుభసూచకమని అన్నారు. పాలకవర్గం సూచన అధికారుల కృషి కమిషన్ ఏజెంట్ల చొరవతో ఎలాంటి ఆటంకాలు లేకుండా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తడిసిన ప్రతి గింజను కొన్నామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరించారు. మార్కెట్ యార్డులో మౌలిక వసతులపై అభివృద్ధిపై చర్చిస్తూ రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో రైతులకు అనుగుణంగా పరిస్థితులు ఉన్నప్పటికీ కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై బురదజల్లే పని పెట్టుకుంటున్నారని అలాంటి వారిని పట్టించుకోవద్దని తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోవాలని ఈ సందర్భంగా సూచించారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే విషయాలను పరిగణలోకి తీసుకొని రాజకీయంగా చేసే విమర్శలను పట్టించు కోకూడదని పాలక కమిటీకి సూచించారు. యాడుకు వచ్చే ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా అధికారులు పాలకవర్గం కమిటీ కమిషన్ ఏజెంట్లు చొరవ చూపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కేట్ కమిటి వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్, డైరెక్టర్ కరుణాకర్ భరత్ లోహోటీ, రవి నాయక్, పి నర్సింలు, కక్కునూరు సందీప్ కుమార్, వెంకట నరసింహారెడ్డి, తాడిశెట్టినవీన్, కమిషన్ ఏజెంట్లు ప్రకాష్ గుప్తా, జగదీశ్వర్ గుప్తా , కొట్ర రాజు, సరపు మల్లేష్, సంజీవయ్య, పెంటయ్య, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు..

🌐 Select Language:
📰 ePaper