కెనరా బ్యాంకు వారి సౌజన్యంతో రూ.4 లక్షలు ఆర్థిక భరోసా
పయనించే సూర్యుడు మే 30 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)సూళ్లూరుపేట కేఆర్ పి కాలనీ డి.జయంతి రోడ్డు ప్రమాదం ద్వారా మరణించడం జరిగింది. ఈమె గురించి బ్యాంక్ లో విచారించగా ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన(పిఎంఎస్ బివై), ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన రెండు యాక్టివ్ లో ఉన్నాయి అని తెలిసింది. దీనికిగాను సూళ్లూరుపేట ఆర్ధిక అక్షరాస్యతా కౌన్సిలర్స్ అయిన మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము. దీని ద్వారా రూ.4 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పిఎమ్ఎస్ బివై మరియు పీఎంజెజెబివై ద్వారా రూ.4 లక్షలు రూపాయలు చెక్కును భర్త హరికృష్ణ కు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ టి. కరుణానిధి మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన అందరూ చేసుకోవాలని భవిష్యత్తులో జరిగే అకాల సంఘటనలకు మీ కుటుంబాలకి చేయూత కలిగే విధంగా భరోసా కల్పిస్తుంది అని తెలియజేసినారు. ఈ స్కీమ్స్ ఇప్పుడు రెన్యూవల్ అవుతాయి కాబట్టి అందరు మీ అకౌంట్ లో డబ్బులు ఉంచుకొనేలా చూసుకోవాలని తెలియజేశారు. పై కార్యక్రమంలో సూళ్లూరుపేట కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ టి. కరుణానిధి, మేనేజర్ మహేష్,బ్యాంకు సిబ్బంది నాగేంద్ర బాబు, వెంకటేశ్వర్లు మరియు సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ముని చంద్ర, పరమానందం పాల్గొనడం జగిరింది.