తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీఆర్‌ఎస్ నాయకుల ప్రతిజ్ఞ

June 2, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాధవరం నగర్ కాలనీలోని బీఆర్‌ఎస్ డివిజన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఉద్యమకారులు, స్థానిక నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాధవరం రంగారావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు, యువకులు చేసిన త్యాగాల ఫలితంగానే అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిందని అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రిగా పదేళ్లపాటు కెసిఆర్ పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని, తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపారని కొనియాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మాయమాటలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.అనంతరం తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర సాధన స్ఫూర్తిని కాపాడేందుకు అందరితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, దంతాలపల్లి బాబురావు, లక్ష్మీనారాయణ, వేముల ఆంజనేయులు, మధు, జగదీష్ గౌడ్, ప్రవీణ్, రవీందర్రావు, వెంకట్ రెడ్డి, కొండలరావు, కిషన్, బాబు, నరసింహారెడ్డి, రమణారెడ్డి, యశ్వంత్, టి.కృష్ణారావు, వేణు, సోమయ్య, అనిల్, రామచందర్, మోహన్‌రావు, శ్రీధర్, శేఖర్, మురళి, మాధవి రెడ్డి, శైలజ, కరుణ, శ్రావణి, రమేష్, నరహరి, సంపత్, వెంకటేష్, మల్లేష్, నవీన్, రామారావు, కరుణాకర్, కె.వి.రావు, రాజవర్ధన్ రెడ్డి, జగన్‌మోహన్‌రావు, విజయ్ సాగర్, రాజేందర్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు, చారి, రాజు, శ్రీను, పూల బాబు, రమేష్‌రావు, సోమేష్, అరవింద్, మహేష్, సంతోష్, జాన్సన్, యాదగిరి, విక్రమ్, జగదీష్, రవి, హరీష్, వినయ్, మోహన్ చారి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

🌐 Select Language:
📰 ePaper