భైంసా పట్టణంలోఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ; తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బైంసా పట్టణంలోని గురుకృపా కళాశాలలో 12 వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరం నియోజకవర్గ కన్వీనర్ గిరిధర్ జాంగ్మే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బైంసాకు చెందిన నాంపల్లి భాస్కరాచారి , టోపాయి రవి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గౌడ్ హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలు, పోరాటాలను గత ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులు గత ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి, తెలంగాణ ఉద్యమ అంశాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచేలా కృషి చేశారని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధా కార్యదర్శి చాకేటి లస్మన్న, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు గౌతం పింగ్లే, రఘువీర్ , తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కుబీర్ మండల అధ్యక్షులు పీరాజీ, డాక్టర్ పోశెట్టి ,కిషన్, ఫజల్, ఇమాద్, సతీష్ , సాయినాథ్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమకారుల ఫోరం – బైంసా పట్టణ కమిటీ ఏర్పాటుఅధ్యక్షులు: గౌతం పింగ్లేప్రధాన కార్యదర్శి: రఘువీర్ కార్యదర్శి: బోసి కిషన్. ఉపాధ్యక్షులు.ఫజల్ అహ్మద్.