తెలంగాణ రాష్ట్ర 13వ అవతరణ దినోత్సవం సందర్భంగా భీంగల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మల్లెల.లక్ష్మణ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు.

June 2, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు 2 జూన్ 2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవనీ పురస్కరించుకొని భీంగల్ మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని కొనియాడారు.అమరవీరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల ని వారు పిలుపునిచ్చారు ఎంతోమంది ప్రాణ త్యాగాలు ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పట్టుదలతోని తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆనాడు ఆంధ్ర నాయకులు పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ బిల్లుకు అడ్డుపడినప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము కొరకు అసురులు బాసిన ఎందరో అమర వీరుల త్యాగం మేరకు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారం లోకి వస్తుంది అన్ని జిల్లాల్లో పెద్దలు సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి చేస్తామని మల్లెల లక్ష్మణ్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇల్లు గాని ఫ్రీ బస్సు గానీ ఆరోగ్యశ్రీ గాని పరిమితి పెంచడం కానీ 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ గాని 5 1 గ్యాస్ సిలిండర్ గాని అందించడం జరుగుతుంది అని రాబోయే కాలంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తుంది అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి లక్షణం లక్ష్యంగా అని తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యముగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మహేష్ కుమార్ గౌడ్ ముందుకు వెళుతున్నారని వారి సారథ్యంలో కచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది మల్లెల లక్ష్మణ్ అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.

🌐 Select Language:
📰 ePaper