నల్ల మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామాలలో కరపత్రాలతో విస్తృత ప్రచారం

June 3, 2026 | తెలంగాణ

5న జరిగే ధర్నా కార్యక్రమానికి ప్రజలు హాజరుకావాలని విజ్ఞప్తి.*

పయనించే సూర్యుడు మే 4:ఈరోజు ఉదయం ఏడు గంటలకు దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు ఖానపురం, కర్ని గ్రామాలకు చేరుకున్నారు. ఖానపురం గ్రామానికి వెళ్లి శివాజీ కూడలి దగ్గర కూర్చున్న రైతులను కలిసి 5వ తేదీన జరిగే ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఆంజనేయ గుడి కాడికి వెళ్లి అక్కడ రైతులను కలిశారు. ఆ తరువాత బస్టాండ్ దగ్గర ఉన్న రైతులను కలిసి విషయాన్ని వివరించడం జరిగింది. అందరికీ పేరుపేరునా విజ్ఞప్తి చేస్తూ ఐదో తేదీన రైతు ప్రయోజనం కొరకు జరుగుతున్న ధర్నాకు రావాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతుల దగ్గర అనేక రకాలైన చర్చ జరిగింది. వాటన్నిటికీ ప్రజా సంఘాల ప్రతినిధులు పరిష్కార అంశాలను తెలియజేశారు.కర్ని గ్రామంలో కరపత్రాలతో ఇంటింట ప్రచారం వీధులలో ప్రచారం చేసి రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు తరలించడం తప్పుడు పద్ధతి అని తెలియజేయడమైనది. వండ్రు మట్టి రైతుల పొలాలకు వేయడం వల్ల సూక్ష్మ పోషకాలు వండుమట్టిలో ఎక్కువ ఉంటాయి కనుక రైతుల భూములకు పనికొస్తాయని పంటలు అధిక దిగుబడి వస్తుందని రైతాంగానికి తెలియజేశారు.మన ఊరు చెరువుని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ గ్రామాలలో ప్రచార క్యాంపియన్ కొనసాగుతున్న క్రమంలో రైతుల నుండి ఆయా గ్రామాల ప్రజల నుండి నల్లమట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ధర్నా కార్యక్రమానికి రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరిగింద.ఈ కార్యక్రమంలో* అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు భగవంతు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, బీసీ రాష్ట్ర ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు గౌడ్ గారు, కానాపురం గ్రామ బీసీ ఐక్యవేదిక నాయకులు అమ్మకుల సురేష్, రవికుమార్ మండల నాయకులు మండల నాయకులు రవికుమార్ గారు, కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షులు డి చంద్రశేఖర్. టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ .తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని 100 మంది ప్రజలను కలసి ధర్నాకు రావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper