ఘనంగా ముగిసిన కడియాల కుంట తండా క్రికెట్ టోర్నమెంట్

June 4, 2026 | తెలంగాణ

*మొదటి విజేతగా సీఎస్కే రెండో విజేతగా ముంబై ఇండియన్స్*

*మొదటి బహుమతి దాత వార్డ్ నెంబర్ గోపి నాయక్*

*రెండో బహుమతి దాత మూడవ వినోద్ నాయక్*

*కార్యక్రమంలో పాల్గొన్న ఉప సర్పంచ్ తావు సింగ్ నాయక్ మరియు వార్డ్ సభ్యులు*

( పయనించే సూర్యుడు జూన్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)ఫరూక్నగర్ మండలం కడియాలకుంట తండా గ్రామపంచాయతీ పరిధిలో గత ఐదు రోజులుగా జరుగుతున్న కీర్తి శేషులు రాకేష్ నాయక్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కడియాల కుంట తండా ప్రీమియర్ లీగ్ సీజన్ 4 నేటితో ఘనంగా ముగిశాయి. ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు హోరాహోరీగా తలబడ్డాయి. ఫైనల్ గా చెన్నై సూపర్ కింగ్ విజయం సాధించడం జరిగింది. చెన్నై జట్టుకు వార్డ్ సభ్యులు గోపి నాయక్ 12 వేల రూపాయలు మరియు టోపీని మొదటి బహుమతిగా అందించడం జరిగింది. అదేవిధంగా రన్నర్పుగా గెలిచిన ముంబై జట్టుకు వినోద్ నాయక్ 8 వేల రూపాయలు మరియు రూపీని రెండో బహుమతిగా అందజేయడం జరిగింది. మరియు బెస్ట్ బ్యాట్ మాన్ గా నేనవత్ సందీప్ మరియు బెస్ట్ బౌలర్ గా పాల్తావత్ శివ ( గుండు ) నిలిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ డిప్యూటీ సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు గోపి నాయక్ మాట్లాడుతూ… విద్యార్థులు యువకులు క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎప్పుడూ తమ వెంబడే ఉంటామని తమకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని మొదటి బహుమతి దాత గోపి నాయక్ అన్నారు. అనంతరం రెండో బహుమతి దాత వినోద్ మాట్లాడుతూ క్రీడలను క్రీడలు గానే చూడాలని ఎలాంటి వ్యత్యాసాలు చూపించకూడదని అందరూ కలిసికట్టుగా ఆడి ఉన్నత స్థాయికి వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కడియాల కుంట తండా డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్ వార్డు సభ్యులు గోపి నాయక్ చాట్ పట రవీందర్ నాయక్ నీలా భాస్కర్ నాయక్, దేవి రవి నాయక్, యువ జర్నలిస్ట్ నరేందర్ నాయక్, వివో రాజు నాయక్, వినోద్ నాయక్, రాత్లావత్ రమేష్, శివ, వినోద్, సిద్దు, మెగావత్ రమేష్ మునావత్ కిషన్ మరియు ఆర్గనైజర్లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper