ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమం
పయనించే సూర్యుడు జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి పిలుపు మేరకు, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కొనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినది మనకు జన్మనిచ్చి, ప్రేమను పంచి, జీవితానికి పునాది వేసిన అమ్మను స్మరించుకుంటూ, ఆమె పేరుతో ఒక మొక్కను నాటి ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తున్నాము. ఒక మొక్కను నాటడం అంటే కేవలం చెట్టును పెంచడం మాత్రమే కాదు, భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణం మరియు సురక్షితమైన భవిష్యత్తును అందించడమే. కూటమి ప్రభుత్వ లక్ష్యం ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువత, మహిళలు మరియు ప్రతి గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, తమ తల్లి పేరుతో కనీసం ఒక మొక్కను నాటి ఈ హరిత యజ్ఞాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.అమ్మ ప్రేమకు గుర్తుగా ఒక మొక్కను నాటి, పచ్చని కొనసీమ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. ఈ కార్యక్రమం కు ముమ్మడివరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు మట్ట సూరిబాబు తదితరులు పాల్గొన్నారు