ఈ రోజు ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ఏర్గట్ల గ్రామానికి చెందిన TG ECET రాష్ట్ర స్థాయిలో 8 వ ర్యాంక్ సాధించిన దొబ్బల రేష్వంత్
పయనించే సూర్యుడు 5 6 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ; బాల్కొండ నిజ వర్గంలో ఏరుగట్ల మండలం ఏరుగట్ల గ్రామం లో విద్యార్థిని శాలువతోని సన్మానించి సరస్వతి దేవి ఫోటోను బహూకరించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భముగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ ఏర్గట్ల ప్రభుత్వ పాఠశాలలో, నిజామాబాద్ ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజ్ లో చదివి తెలంగాణ స్టేట్ లెవెల్ లో ECET 8 వ ర్యాంక్ మరియు ఏపీ స్టేట్ లెవెల్ లో 6 వ ర్యాంక్ రావడంతో గొప్ప విషయమని రేష్వంత్ ను అభినందించి దీన్ని ఇంకొకరు ఆదర్శముగా తీసుకొని ఏర్గట్ల పేరు తెచ్చే విధముగా ఏ రంగాలలో మెరిట్ సాధించినా ప్రభుత్వ సంస్థలో కూడా చదివి బీటెక్ యూనివర్సిటీ క్యాంపస్ ఉచిత సీట్ మరియు NIT క్యాంపస్ లో సీట్ వచ్చే అవకాశం యుందని భవిష్యత్తులో ఏర్గట్ల మండల స్థాయి పరిధిలో కూడా ఎవరైనా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారికి ప్రోత్సహించాడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని శివకుమార్ తెలిపారు. ఇట్టి కార్యక్రమములో కేఎంసీ డైరెక్టర్ కొర్రిపల్లి లింగారెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి, ఉప సర్పంచ్ సున్నం శ్రీనివాస్, గడ్డం జీవన్, పన్నాల నర్సారెడ్డి, కూరాకుల బొర్రన్న, దండేవోయిన సాయన్న, ఓర్సు రాములు, రాజారాం సహదేవ్, బద్దం ముత్యం, సంగెం ఆనంద్, ఇప్ప మల్లారెడ్డి, మునిమాణిక్యం అజయ్, ఎస్కే సలీం, దొబ్బల రాజన్న తదితరులు పాల్గొన్నారు