రైతు వ్యవసాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం!

June 5, 2026 | తెలంగాణ

:పయనించే సూర్యుడు మే 6: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా తహసిల్దార్ కార్యాలయం ధర్నా కార్యక్రమాలకు అఖిలభారత ఐక్య రైతు సంఘం పిలుపునిచ్చింది అందులో భాగంగా మక్తల్ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో మక్తల్ తహసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలభారత ఐక్య రైతు సంఘం అధ్యక్షులు సి ఆర్ భగవంతు మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మన రైతాంగానికి తమ పంటలపై కనీస మద్దతు ధర (MSP) లభించడం లేదు. వ్యవసాయ ఉత్పాదకాల (ఇన్పుట్స్) ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో రైతాంగం సంవత్సరానికి 200 రోజుల పని, రోజుకు 700 రూపాయల కూలి డిమాండ్ చేస్తుంటే, మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శ్రామిక ప్రజల అంచనాలకు, అవసరాలకు విరుద్ధంగా ఉన్నాయి. మోదీ ప్రభుత్వం MGNREGA (ఉపాధి హామీ చట్టం)ని పూర్తిగా రద్దు చేసి, దాన్ని కేవలం కేంద్ర పర్యవేక్షణలోని ఒక పథకంగా మార్చేసింది.గ్రామీణ ప్రజలు భూమి లేనివారికి భూమి, ఇల్లు లేనివారికి ఇల్లు, ఉ ద్యోగం లేనివారికి ఉద్యోగం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులందరికీ పూర్తి రుణమాఫీని డిమాండ్ చేస్తున్నారు. అయితే, రైతు ప్రజల న్యాయమైన, చట్టబద్ధమైన డిమాండ్లను నెరవేర్చడానికి బదులుగా, మోదీ పాలన ఇండో-అమెరికన్ వాణిజ్య ఒప్పందం ద్వారా మన వ్యవసాయాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు తెరవడం ద్వారా దేశ, రైతు ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది.ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం నాయకులు ఆనంద్ వెంకటేష్ తిమ్మరాజు నరసమ్మ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper