రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను కమిటీ నిర్వాహకులు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన పట్టెపు రాములు అమ్మవారి విగ్రహాన్ని కొనుగోలు చేసి కమిటీ నిర్వాహకులకు అందజేశారు. తొమ్మిది రోజులపాటు దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయి. అమ్మవారికి అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో దుర్గామాత అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ పూజా కార్యక్రమంలో దుర్గామాత మాలధారణ స్వాములు, గ్రామ పెద్దలు, కమిటీ నిర్వాహకులు, సభ్యులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.