ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్ గురుకులంలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆకస్మిక తనిఖీ

అంబేద్కర్ గురుకులంలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆకస్మిక తనిఖీ

చొల్లంగిపేట గురుకులంలో వసతులు పరిశీలన.. పెండింగ్ పనులపై అసంతృప్తి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 28 ప్రతినిధి,(గ్రంధి నానాజీ: ) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలను ముమ్మిడివరం శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గురుకులంలో విద్యార్థులకు అందుతున్న విద్య,వసతులు,భోజనం,వంటశాల,కిచెన్ షెడ్,డ్రైనేజీ వ్యవస్థ,ఆఫీస్ రూమ్,సిబ్బంది గదులను పరిశీలించారు.విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం,వసతులు,సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా ఐదవ తరగతి,పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి చదువు,పాఠశాలలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.గురుకులంలో సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన ఆయన పనులు ప్రారంభమై సంవత్సరం పూర్తవుతున్నా బెడ్లు,పరుపులు వంటి విద్యార్థుల అవసరాలకు సంబంధించిన పనులు పూర్తికాకపోవడంపై అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.వంటశాల,కిచెన్ షెడ్ ను పరిశీలించి పాఠశాలలో పూర్తి స్థాయిలో శుభ్రత,పరిశుభ్రత పాటించాలని, నాణ్యమైన,పరిశుభ్రమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు.నాణ్యత లేని కూరగాయలు వినియోగించకూడదని సూచించారు.అనంతరం చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు గంగ సూర్యనారాయణతో కలిసి సిబ్బందితో సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,విద్యార్థుల భద్రత,ఆరోగ్యం,విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.పాఠశాల పరిసరాలు,తరగతి గదులు,వసతి గృహాలు,వంటశాలలో నిరంతరం పరిశుభ్రత పాటించి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS