బాణాపురంలో నూతన దంపతులను ఆశీర్వదించిన ఎంపీ,ఎమ్మెల్యేలు,బీజేపీ నేతలు
పయ నించే సూర్యుడు సెప్టెంబర్27, ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం నియోజవర్గం ఐ పోలవరం మండలం బాణాపురంలో రాయపరెడ్డి రాజా కుమారుని వివాహ రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వేడుకకు రాష్ట్ర నలుమూలల నుండి అనేకమంది వీఐపీలు,ప్రజాప్రతినిధులు హాజరై సందడి చేశారు.రాజ్యసభ సభ్యులు సానా సతీష్,ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు,అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు,జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి,ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్,కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ,తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు,గ్రీన్ కో అధినేత చలమలశెట్టి సునీల్,ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరై నూతన వధూవరుల ను ఆశీర్వదించారు.అలాగే బీజేపీ గుంటూరు జిల్లా ఇంఛార్జ్ యాళ్ల దొరబాబు,బీజేపీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, అడప సాయి, గ్రంధి నానాజీ, నంద్యాల చంటి, మట్ట శివ, రంబల రమేష్ తదితర బీజేపీ నేతలు కూడా హాజరై వధూవరులను అభినందించారు.వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాయపరెడ్డి రాజా కుటుంబ సభ్యులు విచ్చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.