PS Telugu News
Epaper

సూర్య, చంద్ర, భక్తుల కలయిక.. శ్రీశైలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి

📅 06 Nov 2025 ⏱️ 12:52 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు. ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు. అంతకు ముందు జ్వాలాతోరణానికి ఉపయోగించే వొత్తులను ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. నూలు పోగువొత్తులను ప్రకాశం జిల్లా వేటపాలం మండలం ఆమోదగిరిపట్నంకి చెందిన వసుందరరావు కుటుంబీకులతో వచ్చి ఆలయానికి అప్పగించడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు. ఈ జ్వాలాతోరణోత్సవాన్ని తిలకించి భస్మాన్ని నుదుటిన ధరించడంతో సకల గ్రహపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధులు సందడిగా మారాయి. త్రిపురాసురులను సంహరించిన తరువాత పరమేశ్వరుని దృష్టిదోషనివారణ కోసం పార్వతీదేవి తొలిసారిగా జ్వాలాతోరణోత్సవాన్ని జరిపించినట్లు పురాణ ఇతిహాసాల్లో ఉన్నందున శ్రీశైల క్షేత్రంలో కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈవో చెప్పారు. 

Scroll to Top