PS Telugu News
Epaper

భారీ పేలుడు ఘటనతో పాకిస్తాన్ వణికింది – అధికారులు దర్యాప్తు ప్రారంభం

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం (నవంబర్ 11) మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. జిల్లా కోర్టు సమీపంలో జరిగిన ఘటనలో 9 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కోర్టు కాంప్లెక్స్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన కారులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ పేలుడు సంభవించింది.ఈ పేలుడు శబ్దం పోలీస్ లైన్స్ ప్రధాన కార్యాలయం వరకు వినిపించింది. చుట్టుపక్కల ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే రెస్క్యూ, రిలీఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ప్రాథమిక దర్యాప్తు కోసం బాంబ్ స్క్వాడ్‌లను, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కోర్టు కాంప్లెక్స్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన వాహనాలకు సమీపంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. అక్కడ ఉన్న ప్రజలలో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారందరినీ వెంటనే పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అక్కడ చికిత్స పొందుతున్నారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పేలుడు సంభవించడానికి కారణం అమర్చిన పరికరమా, సిలిండర్ పేలుడునా లేదా సాంకేతిక లోపంనా అనేది వెంటనే స్పష్టంగా తెలియదని అధికారులు చెబుతున్నారు. పేలుడు స్వభావాన్ని తెలుసుకోవడానికి బాంబు నిర్వీర్య నిపుణులు శిథిలాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

Scroll to Top