పుట్టినరోజు సందర్భంగా అగాపే ఆశ్రమంలో అన్నదానం.
పయనించే సూర్యుడు నవంబర్ 11 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో నంద్యాల జిల్లా అబ్దుల్లాపురం గ్రామ వాస్తవ్యులు వీరాపురం కళావతి ,ఆమె పెద్ద కుమారుడు వీరాపురం సునీల్, భార్య కీర్తన, చిన్న కుమారుడు సీమోన్ , మనవరాలు తనుషా, మనవడు చర్విక్ వీరి కుటుంబము ఆశ్రమంలోని నిరాశ్రయులకు, వృద్ధులకు భోజనం పెట్టాలి అని, ఒక ఆశతో ప్రేమ కలిగి చిన్న బిడ్డ తనూష పుట్టినరోజు శుభ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు.ఇందు నిమిత్తమై ఆశ్రమం ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా ఆ బిడ్డకు శుభాకాంక్షలు తెలియజేసి,వారి కుటుంబానికి అభినందనలు తెలిపారు.
