రుద్రూర్, పయనించే సూర్యుడు .16.11.2026 న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజలను రైతులను ఆదుకుంటుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నాయన్నారు. నిన్న జరిగిన టిఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నవంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్య నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, ప్రజల సంక్షేమం కొరకు వివిధ పథకాలను ప్రవేశపెట్టి అందజేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజలను రైతులను ఆదుకుంటుందన్నారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ నిస్సార్, వార్డు మెంబర్ ఆమంద్ వెంకటేష్, నాయకులు కర్క అశోక్, పత్తి రాము, పార్వతి ప్రవీణ్, మాజీ ఎంపిటిసి గౌస్, సుదర్శన్ గౌడ్, చిక్కడపల్లి రవి, బర్ల చిట్టి, గాండ్ల శ్రీను, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.