PS Telugu News
Epaper

ఛాంపియన్ ప్లేయర్‌కు పెద్ద షాక్! ఫ్రాంచైజీలు రిటైన్ లిస్టులో లేకుండా చేశారు!

📅 06 Nov 2025 ⏱️ 10:44 AM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) కోసం ఐదు జట్ల రిటెన్షన్ జాబితాలు వెల్లడయ్యాయి. అయితే, ఆశ్చర్యకరంగా, 2025 ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దీప్తి శర్మ విడుదలవ్వడం గమనార్హం. దీంతో అంతా షాక్‌లో ఉన్నారు.ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) వేలానికి ముందు, ఐదు ఫ్రాంచైజీలు నిలుపుకున్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించారు. ఈసారి, అన్ని జట్లు గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకోవాల్సి ఉంటుంది. మిగిలిన ఆటగాళ్లందరినీ వేలానికి ఉంచుతారు. రైట్ టు మ్యాచ్ కార్డును కూడా వేలంలో ఉపయోగిస్తారు. అత్యంత ఆశ్చర్యకరమైన రిటెన్షన్ నిర్ణయం యూపీ వారియర్స్ తీసుకుంది. ఒకే ఒక ఆటగాడిని నిలుపుకుని, మిగిలిన జట్టును విడుదల చేశారు.

దీప్తి శర్మను నిలుపుకోలే.. ESPNcricinfo నివేదిక ప్రకారం, ఉత్తర ప్రదేశ్ వారియర్స్ శ్వేతా సెహ్రావత్‌ను మాత్రమే నిలుపుకోవాలని నిర్ణయించుకుంది. దీని అర్థం 2025 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయిన దీప్తి శర్మను విడుదల చేశారు. ఇంతలో, ఆస్ట్రేలియా అనుభవజ్ఞురాలైన క్రీడాకారిణి అలిస్సా హీలీని కూడా నిలుపుకోలేదు. అందువల్ల, ఈ స్టార్ ఆటగాళ్లు వేలానికి హాజరుకానున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ అమేలియా కెర్ వంటి స్టార్ ఆటగాళ్లను కూడా ఆయా జట్లు విడుదల చేశాయి. మరోవైపు, భారత స్టార్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మలను ఆయా జట్లు అట్టిపెట్టుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోగా, యూపీ వారియర్స్ ఒకరిని మాత్రమే అట్టిపెట్టుకుంది.ఢిల్లీలో జరిగే వేలం కోసం ప్రతి ఫ్రాంచైజీకి రూ. 15 కోట్ల పర్స్ కేటాయించారు. ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకున్న ఏ ఫ్రాంచైజీ అయినా రూ. 15 కోట్ల పర్స్ నుంచి రూ. 9.25 కోట్లు వాడుకోవాల్సి ఉంటుంది. నలుగురికి రూ. 8.75 కోట్లు, ముగ్గురికి రూ. 7.75 కోట్లు, ఇద్దరికి రూ. 6 కోట్లు, ఒకరికి రూ. 3.5 కోట్లు చెల్సించే ఛాన్స్ ఉంటుంది. మొదటి రిటైన్డ్ ప్లేయర్‌కు రూ. 3.5 కోట్లు, రెండవ ప్లేయర్‌కు రూ. 2.5 కోట్లు, మూడవ ప్లేయర్‌కు రూ. 1.75 కోట్లు, నాల్గవ ప్లేయర్‌కు రూ. 1 కోటి, ఐదవ ఆటగాడికి రూ.50 లక్షలు లభిస్తాయి.

Scroll to Top