షాద్నగర్ నియోజకవర్గం బీసీ సేన సమావేశం
నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సమావేశం
( పయనించే సూర్యుడు నవంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
నిన్న జరిగిన పరిణామలతో బీసీ సేన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప అధ్యర్యంలో ఈ రోజు బీసీ సేన సంఘం అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సమావేశం లో కత్తి చంద్రశేఖర్ అప్ప మాట్లాడుతూ బీసీ సేన సంఘం భవిష్యత్ కార్యాచరణ,నియమ నిబంధనలు తదితర అంశాలపై చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చౌదర్ గూడ మండలం బీసీ సేన మహిళా అధ్యక్షురాలు ప్యాట జయ విమర్శలు చేసిన సందర్బంగా సంఘంసభ్యులు మందలిస్తే వారిపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్?, ఒక మహిళా అధ్యక్షురాలు అయి ఉండి స్థాయి ని మించి మాట్లాడొద్దని తెలిపినందుకు చర్యలా? వెంటనే బహిరంగంగా ఎమ్మెల్యే కు క్షమాపణ చెప్పాలి.బీసీ సేన సంఘం సభ్యులతో చర్చించకుండా బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బర్కా కృష్ణ సంఘం సభ్యులపై చర్యలు తీసుకోవడం సరైంది కాదని అందర్నీ కలుపుకొని పోయి బీసీ లను చైతన్యవంతులను చేసి వారిని ఏకతాటిపై తేవాల్సింది పోయి చిన్న చిన్న అంశాలపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదని అన్నారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు కత్తి చంద్రశేఖరప్ప,జమాల్పూర్ చందూలాల్, రఘు, నరేందర్, బాస వరలక్ష్మి,నియోజకవర్గ యువజన అధ్యక్షుల పాలాది శ్రీనివాస్, టౌన్ అధ్యక్షులు తంగేడి పల్లి శంకర్, ఉద్యమ కారులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేకల వెంకటేష్ మరియు జిల్లా రిపోర్టర్ జివ్వు సుధాకర్, నియోజకవర్గ కార్యదర్శి జూపల్లి చంద్రశేఖర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు గడ్డమీద రమేష్,నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి సౌజన్య, వేలూరి వసంత, మమత,
ఫరూక్నగర్ మండల అధ్యక్షురాలు జక్కుల జలజ, ఫరూక్నగర్ మండల ఉపాధ్యక్షురాలు స్రవంతి,
ఫరూక్నగర్ బుజ్జమ్మ, సింధూర, అనిత, సరస్వతి, మీడియా ఇన్ఛార్జ్ నరసింహులు, బాలమణి తదితరులు పాల్గొన్నారు.
