ఈశ్వర్, రాజాసాబ్ హీరోల మధ్య అనూహ్య పోలిక – పరిశీలనలో విశేషం
పయనించే సూర్యుడు న్యూస్ :ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ది రాజా సాబ్ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కావడం ఖాయమని నిర్మాతలు మరోసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయిందని (గుమ్మడికాయ కొట్టేశాం) ఒక ఆసక్తికరమైన విశేషంతో పాటు వెల్లడించారు. ది రాజా సాబ్ షూటింగ్ ముగిసిన రోజు, సరిగ్గా 23 సంవత్సరాల క్రితం ప్రభాస్ మొదటి చిత్రం ఈశ్వర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోజు ఒకటే కావడం గమనార్హం. తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన అదే రోజున, ప్రభాస్ తన కెరీర్లోని అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకదానికి ముగింపు పలకడం ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది.