నిరుపేద కుటుంబానికి దహనసంస్కార ఖర్చులకు సహాయంగా 10,000 విరాళం – పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్ ఔదార్యం
పయనించే సూర్యుడు, నవంబర్ 15( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని కెసిఆర్ నగర్లో ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్న దండి లావణ్య అనారోగ్యంతో మరణించారు. భర్త కోల్పోయిన ఆమెకు ఇద్దరు చిన్న కుమార్తెలు — శివాని, శ్రావణి ఉన్నారు. దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి కుటుంబాన్ని మరింత కృంగదీసింది.ఈ విషయాన్ని తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తన సొంతంగా ₹10,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పద్మశాలి నేత బొల్లి రామ్మోహన్ సహా ఇతరులు కూడా పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి అవసరమైన సమయంలో అందించిన ఈ సహాయం స్థానికంగా అభినందనలు పొందుతోంది.