తెలంగాణ

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఎదుర్లంకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

పయనించే సూర్యుడు అక్టోబర్ 1 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఐ.పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రభుత్వ విప్,ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ బాలయోగి నాయకులు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రత పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి,ఐ.పోలవరం మండల టీడీపీ అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబు రాజు,మాజీ శాసనసభ్యుడు చెల్లి వివేకానంద, చెల్లి అశోక్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS