పయనించే సూర్యుడు అక్టోబర్ 1 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ )డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలెం అంగన్వాడీ కేంద్రంలో ప్రధాని మోదీ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలలో భాగంగా బిజెపి నేతల ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ద్రాక్షారామ అంగన్వాడీ పరిధిలోని వివిధ గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు ఈ ఉత్సవానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి మండల బిజెపి అధ్యక్షుడు ఆకేటి శ్రీకృష్ణ,జిల్లా అంగన్వాడీ ఉత్సవ కో కన్వీనర్,బిఎల్ఏ1 సలాది శేఖర్,రామచంద్రపురం నియోజకవర్గ అంగన్వాడీ ఉత్సవ కన్వీనర్,బిజెపి సీనియర్ మహిళా నేత తలాటం అమ్మాజీ,జిల్లా సేవా సంకల్ప్ అభియాన్ కన్వీనర్,కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు,మండల బిజెపి ప్రధాన కార్యదర్శి పుల్లెల రామమూర్తి,మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు బి.పద్మావతి,ఉమా,బివిబిఎల్ నారాయణ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిజెపి నేతలు అంగన్వాడీ కేంద్రాలలో ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పౌష్టికాహార పదార్థాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ద్రాక్షారామ పరిధి అంగన్వాడీ కార్యకర్తల నాయకురాలు కె.జహీర్ ను బిజెపి నేతలు సత్కరించారు.అదేవిధంగా శ్రీకృష్ణ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు కలములు,చిన్నారులకు బిస్కెట్లు అందజేశారు.బిజెపి నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పోషక పదార్థాలు పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు సక్రమంగా అందడంలోనూ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడంలోనూ అంగన్వాడీ కార్యకర్తల కృషి అభినందనీయ మని కొనియాడారు.అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు,పిల్లలు,తల్లిదండ్రులు,బిజెపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.