తెలంగాణ

మక్తల్ నియోజకవర్గంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

మక్తల్ నియోజకవర్గంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

మక్తల్ నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్

పయనించే సూర్యుడు అక్టోబర్ 2మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్ మున్సిపాలిటీతో పాటు కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి చేసిన సేవలను, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ.మహాత్మా గాంధీజీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చూపిన మార్గం దేశ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. సత్యం, అహింస, శాంతి అనే సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.గాంధీజీ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా, సమాజంలో సమానత్వం, సామరస్యం, పరిశుభ్రత, స్వావలంబన, గ్రామ స్వరాజ్యం వంటి విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఆయన ఆలోచనలు నేటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.సత్యం, అహింసతో కూడిన గాంధీజీ మార్గం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా శాంతియుత మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలనే సందేశాన్ని ఆయన అందించారని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని డాక్టర్ మణికంఠ గౌడ్ అన్నారు.అలాగే దేశ సమగ్రత, ఐక్యత కోసం గాంధీజీ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎండి సోఫీ బాల్ రెడ్డి. ఉమేష్ భీమేష్ పరశురాం ఎల్ భీమేష్ చెన్నకేశవులు బి రాజు పరశురామ్ గౌడ్ ఖానాపూర్ బాలు నరేష్ ఆనంద్ మరియు కృష్ణ మండల జనసేన నాయకులు మాడి హనుమంతు రమేష్ గాడిపే అంజప్ప చక్రవర్తి శ్రీకాంత్ తరుణ్ లక్ష్మణ్ సామాజిక కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS