తెలంగాణ

జెన్ జీ లు గాంధీజీ , శాస్త్రీ గార్లను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి… తపస్.

జెన్ జీ లు గాంధీజీ , శాస్త్రీ గార్లను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి… తపస్.

పయనించే సూర్యుడు అక్టోబర్2మక్తల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మక్తల్ ఆవరణలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా వారి ఫోటోలకు పూలమాలవేసి ఘనంగా జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది..కార్యక్రమం ను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈశ్వరి నాగార్జున మాట్లాడుతూ జెన్ జీ లు మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీ గార్ల సేవలను ఆదర్శం గా తీసుకుని దేశ అభివృద్ధి లో పాలు పంచుకోవాలని పేర్కొన్నారు.అనంతరం తపస్ జిల్లా ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి మాట్లాడుతూ సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకొని సత్యగ్రహం, సహాయ నిరాకరణ వంటి ఉద్యమాల ద్వారా బ్రిటీష్ పాలనను పారద్రోలిన మహానేత మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు…. తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ
నిజాయితీ, నిరాడంబరత, నైతిక విలువలు, దృఢచిత్తముతో, “జై జవాన్ -జై కిసాన్”అనే నినాదం తో దేశ రక్షణకు సైనికుడి సేవ ఎంత ముఖ్యమో, దేశ ఆహార భద్రతకు రైతు శ్రమ అంతే ముఖ్యమని చాటి ప్రజలలో చెరగని ముద్ర వేసి భారత దేశ రెండవ ప్రధానిగా ప్రజల హృదయాలలో చిరకాలం నిలిచిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తపస్ మక్తల్ మండల అధ్యక్ష, కార్యదర్శులు కర్రెమ్ నరసింహ, రాకేష్ కుమార్ కృష్ణ మండల అధ్యక్షులు రమేష్, తపస్ నాయకులు రవీందర్ రెడ్డి, రాము గౌడ్, సురేష్, ప్రవర్ధన్, డి. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS