పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ముధోల్ నియోజకవర్గం లో చాలా వరకు వ్యవసాయం మే ఇక్కడి ప్రజల జీవనదారం,వర్ష కాలం పూర్తి కావాల్సి వస్తున్న ఎల్నినో కారణం గ మ ప్రాంతం లో అనుకున్నంత వర్ష పతం నమోదు కాలేదు. చాలా వరకు వర్ష ఆధార పంటలే, మ ముధోల్ నియోజకవర్గం లోని 7 మండలాలను ఒక మున్సిపాలిటీ ని అన్నిటిని కరువు ప్రాంతాలుగ ప్రకాటించి ఇక్కడ ఉన్న రైతంగాన్ని ఆదుకోవాలని కోరారు.నియోజకవర్గం లో తాగునిటీ కోసం ఆధానంగా బోర్లు వేయడానికి నిధులు మంజూరు అయేలా చూడాలని అన్నారు.భైంసా పట్టణ కేంద్రం లో ఇప్పటి వరకు ఒక్క ఇందిరామ్మా ఇల్లు కూడా మంజూరు కాలేదు కారణం అక్కడ స్టే ఉంది స్టే ఆర్డర్ ను క్లియర్ చేసి అక్కడ ఉన్న నిరు పేదలకు ఇల్లు మంజూరు అయేలా చూడాలని అన్నారు.కుబీర్ మండలం లోని నిఘ్వ గ్రామం గడ్డన్న వాగు ప్రాజెక్టు ముంపు గ్రామం అ గ్రామం లో సుమారు 300 వరకు ప్లాట్లు రెడీ గ ఉన్నవి మరియు సీసీ రోడ్డు డ్రైనేజి లు కూడా కంప్లీట్ అయినవి. అ యొక్క ప్లాట్ల ను లబ్ది దారులకు అందచేయాలనీ కోరటం జరిగింది.భైంసా మండలం లోని గుండెగాం గ్రామస్థులకు ఇండ్ల స్థలాల కు పట్టాలు ఇప్పించి ఇందిరామ్మా ఇండ్లు మంజూరు చేయాలనీ మరియు అవార్డు ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని కోరటం జరిగింది.తానూరు మండలం లోని మొగిలి గ్రామం మరియు హిపనెల్లి,మొగిలితండ మరియు కోలుర్, కోలుర్ తండా మరియు ఝరి బి వాడ్ ఝరి, మహాలింగి మరియు ఇతర మండలం లోని గ్రామలలో పంజాబ్ వారు కొన్న భూముల సమస్య చాలా ఉంది. అమ్మని భూములకు కూడా ప్రోహిబిషన్ లో పెట్టడం జరిగింది దీనివలన రైతులు చాలా బాధలు ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చి ఎంక్వయిరీ చేయడం జరిగింది. ఇటువంటి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వారి యొక్క ఫిర్యాదులు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు. ఈ విషయాన్ని త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరడమైనది.కుబీర్ మండలం లోని హల్ద గ్రామం లో ని కొంత మంది రైతులకు గత కొన్ని సంవత్సరాల క్రితం సీలింగ్ సర్టిఫికెట్ లు ఇవ్వటం జరిగింది. కానీ వాటి యొక్క పట్ట అమలుకలేదు పాస్బుక్ రాలేదు రైతులు చాలా భాధపడ్తున్నారు. ఈ సమస్యను కూడా తొందరగా తీర్చాలని కోరడం జరిగింది.