తెలంగాణ

రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు బూర్గుల విద్యార్థి రేవంత్

రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు బూర్గుల విద్యార్థి రేవంత్

జిల్లాస్థాయిలో అద్భుతంగా రాణించి రాష్ట్రస్థాయికి ఎంపిక

అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ బూర్గుల సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి

( పయనించే సూర్యుడు అక్టోబర్ 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )​రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని జడ్పీహెచ్ఎస్ పీఎం శ్రీ బూరుగుల పాఠశాలకు చెందిన విద్యార్థి రేవంత్ఎస్జీఎఫ్‌ఐ అండర్-14 యోగా విభాగంలో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ ఉమ్మడి జిల్లాల స్థాయి సెలెక్షన్లు పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఆదివారం ఎల్.బి. నగర్‌లో అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీల్లో పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ బూర్గుల పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థి రేవంత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు.​ఈనెల 11 నుండి 13వ తేదీ వరకు సిద్ధిపేట జిల్లాలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించబడనున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.​ఉమ్మడి జిల్లా యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించిన విద్యార్థి రేవంత్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్, ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు ఘనంగా అభినందించారు. సిద్ధిపేటలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రేవంత్ విజయం సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తెవాలని దీవించారు.
​

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS