పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు యూనుస్ చెల్లె కొద్దిరోజుల క్రితం అనారోగ్య కారణం వలన స్వర్గస్తులు కావటం జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి.విఠల్ రెడ్డి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. మాజీ శాసనసభ్యులు వెంట మాజీ సర్పంచ్ హైమద్ పాషా, బైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఫారుక్ హైమద్,నాయకులు సబ్బిడి గజేందర్, సంతోష్, లతీఫ్ మరియు తదితరులు ఉన్నారు.