రోజా మళ్లీ సినిమాల్లోకి అడుగు – డీ గ్లామర్ రోల్‌పై సినీ వర్గాల్లో చర్చలు
పయనించే సూర్యుడు న్యూస్ :హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో రోజా ఒకరు. ఈమె ఏపీ రాజకీయాల్లో బిజీగా మారే క్రమంలో సినిమాలకు దూరమయ్యారు. జబర్దస్త్ వంటి షోతో పాటు కొన్ని షోస్‌లో జడ్జిగా కనిపించింది. ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన తర్వాత టీవీ, సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. కేవలం రాజకీయాల మీదనే ఫోకస్ చేశారీవిడ. అయితే ఇప్పుడు రాజకీయ పదవుల్లో లేరు..యాక్టివ్ పాలిటిక్స్‌కు కాస్త దూరంగా ఉండటంతో ఆమె మళ్లీ నటనపై ఫోకస్ చేశారు. ఇప్పటికే పలు టీవీ షోస్‌కు జడ్జిగా పాల్గొంటున్నారు. తాజాగా రోజా సెల్వమణి సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై డిడి బాలచంద్రన్ దర్శకత్వంలో లెనిన్ పాండ్యన్ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో రోజా కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్ వీడియోను సీనియర్ నటి ఖుష్బూ రిలీజ్ చేసింది. ఇందులో ‘నైంటీస్ క్వీన్ రోజా తిరిగి వస్తోంది’ అనే ట్యాగ్ లైన్లో విడుదలైన ఈ వీడియోలో రోజా పాత సినిమాలకు సంబంధించిన కొన్ని వీడియోస్‌తో పాటు కొత్త సినిమాకు సంబంధించిన సీన్స్‌ను కూడా చూపించారు. రోజా నటిస్తోన్న సినిమాలో మయసు మళ్లిన పెద్దావిడగా..డీ గ్లామర్ లుక్‌లో కనిపించనుంది. ఇకపై రోజా ఎలాంటి సినిమాలు, పాత్రల్లో కనిపించనుందనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. తమిళంతో పాటు తెలుగులోనూ రోజా నటించాలని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.