తెలంగాణ

అశ్వాపురం హెల్త్ సబ్ సెంటర్‌ తనిఖీ*

అశ్వాపురం హెల్త్ సబ్ సెంటర్‌  తనిఖీ*

*ఆకస్మిక తనిఖీ చేసిన అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోతు సదర్ లాల్*

పయనించే సూర్యుడు, అక్టోబర్ 09, అశ్వాపురం: గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోతు సదర్ లాల్ స్థానిక హెల్త్ సబ్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో సబ్ సెంటర్‌లో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా సబ్ సెంటర్‌లో రోజువారీ రిజిస్టర్ అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించిన సర్పంచ్, ప్రతిరోజూ రిజిస్టర్ నిర్వహిస్తూ వైద్య సేవలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.అదేవిధంగా, వైద్య సిబ్బంది తరచూ ఫీల్డ్ విధులకు వెళ్లడం వల్ల స్థానికంగా వైద్య సేవలు అందించడంలో జాప్యం జరుగుతోందని చుట్టుపక్కల ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సర్పంచ్, ఫీల్డ్ విధులు పూర్తిచేసిన వెంటనే తిరిగి సబ్ సెంటర్‌కు చేరుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని, సబ్ సెంటర్‌ను ప్రతిరోజూ తెరిచి ఉంచాలని స్పష్టం చేశారు. *ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందుబాటులో ఉండాలి*గ్రామ ప్రజలకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందించడంతో పాటు, ప్రతిరోజూ రక్తపోటు, రక్తంలో చక్కెర, థైరాయిడ్ వంటి పరీక్షలను అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, వైద్య మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని సర్పంచ్ సూచించారు. ప్రజలు వైద్య సేవల కోసం ఇబ్బందులు పడకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.*నీటి సమస్య పరిష్కారానికి హామీ*తనిఖీ సమయంలో హెల్త్ సబ్ సెంటర్‌లో నీటి సమస్య ఉన్నట్లు గుర్తించిన సర్పంచ్, సమస్యకు గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. మోటార్ మరమ్మతులో ఉందని సిబ్బంది వివరించడంతో, మోటార్‌కు మరమ్మతులు చేయించి సబ్ సెంటర్‌లో నీటి సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన హెల్త్ సబ్ సెంటర్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ ప్రజలు కూడా ఈ కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామలక్ష్మి, హెల్త్ సబ్ సెంటర్ సిబ్బంది రమణమ్మ, ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాశరావు, పంచాయతీ కార్యదర్శి యాకూబ్,మరియు పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS