తెలంగాణ

బాలనగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

బాలనగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బాలనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ, శనివారం సాయంత్రం ఐదు గంటలకు బాలనగర్ దుర్గామాత ఆలయం సమీపంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్‌పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు హాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొననున్నారుఈ సందర్భంగా బాలనగర్ డివిజన్‌లోని మహిళలు, బీఆర్‌ఎస్ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని ఆవుల రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో మహిళలు స్థానికంగా లభించే వివిధ రకాల పూలను అందంగా పేర్చి బతుకమ్మలను తయారు చేసి, సాయంత్రం వేళ బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.బతుకమ్మలో ఉపయోగించే పూలు, ఆకులు ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని, తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. మహిళల సాంస్కృతిక, సామాజిక పాత్రను చాటిచెప్పే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది.ఈ బతుకమ్మ సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనాలని, వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు.వేదిక: దుర్గామాత ఆలయం సమీపంలో, బాలనగర్బాలనగర్ డివిజన్ మహిళలందరూ తమ తమ బతుకమ్మలతో విచ్చేసి, ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS