ఆంధ్రప్రదేశ్

గున్నేపల్లి అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతుల పరిశీలన – చిన్నారులకు నాణ్యమైన విద్య, పోషణే ధ్యేయం: గొల్ల కోటి, బాబీ మాస్టారు, నానాజీ,

గున్నేపల్లి అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతుల పరిశీలన – చిన్నారులకు నాణ్యమైన విద్య, పోషణే ధ్యేయం: గొల్ల కోటి, బాబీ మాస్టారు, నానాజీ,

పయనించే సూర్యుడు అక్టోబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రూరల్ మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని బీజేపీ నేతలు సందర్శించారు. జిల్లా ఉపాధ్యక్షులు, రూరల్ మండల ఇంచార్జ్ గనిశెట్టి వెంకటేశ్వరరావు, ముమ్మిడివరం నియోజవర్గం బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న విద్య, పోషకాహారం, మౌలిక వసతుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పోషణ, బాల్య విద్యకు అంగన్వాడీ కేంద్రాలు వెన్నెముక లాంటివన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీల అభివృద్ధికి పోషణ్ అభియాన్, సక్షమ్ అంగన్వాడీ వంటి పథకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు. చిన్నారుల కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS