తెలంగాణ

టీజీ ఎస్ ఆర్ టి సి దసరా పండుగకు 719 అదనపు బస్సులు నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి తెలిపారు.

టీజీ ఎస్ ఆర్ టి సి దసరా పండుగకు 719 అదనపు బస్సులు నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి తెలిపారు.

పయనించే సూర్యుడుD.9.10.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీ.జీ.ఎస్. ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అక్టోబర్ 9 నుంచి 26 వరకు అదనపు 719 బస్సులు ఏర్పాటు చేసినట్లు రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణమూర్తి తెలిపారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్-1, జామాబాద్-2, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపోల ద్వారా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు మరియు ప్రయాణికులు తమ స్వగ్రామాలకు సురక్షితంగా, సౌకర్యవంతంగా చేరుకునేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని జేబీఎస్ (జూబ్లీ బస్ స్టేషన్) వద్ద ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులను, సిబ్బందిని విధుల్లో నియమిందారు. బస్సుల రాకపోకలను పర్యవేక్షిస్తూ, ప్రయాణికులకు సరైన సమాచారం అందించడం, బస్సులు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడడం, రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, సురక్షితమైన ప్రయాణానికి సహకరించాలని రీజినల్ మేనేజర్ కోరారు.ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా సౌకర్యవంతంగా, ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు. టికెట్ బుకింగ్ సౌకర్యం RTC ఆన్లైన్ వెబ్సైట్ (tgsrtcbus. in) మరియు TGSRTC మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది అని తెలిపారు.దసరా పండుగను పురస్కరించుకుంటున్న ప్రజలకు, ప్రయాణికులకు, టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS