
ప్రిన్సిపల్ రఫత్ సుల్తానా ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు
( పయనించే సూర్యుడు అక్టోబర్ 10 షాద్ నగర్ ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ భాగ్యనగర్ కాలనీ లో శుక్రవారం బతుకమ్మ పండుగను విద్యార్థినులు పాఠశాల ఉపాధ్యాయినులు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.పాఠశాల ప్రిన్సిపల్ రఫత్ సుల్తానా పండుగ విశిష్ఠత ను తెలియ పరుస్తూ బతుకమ్మ’ పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు “బొడ్డెమ్మ” (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు. అని తెలియ పరచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ,వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తి తో పాల్గొన్నారు