ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా ఉప్పూడికి చెందిన జనసేన సీనియర్ నేత రాంబాల రమేష్ నియామకం

స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా ఉప్పూడికి చెందిన జనసేన సీనియర్ నేత రాంబాల రమేష్ నియామకం

పయనించే సూర్యుడు అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామానికి చెందిన సీనియర్ జనసేన నాయకులు రాంబాల రమేష్ ను స్థానిక సంస్థల ఎన్నికల కో ఆర్డినేషన్ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈయన గత 25 సంవత్సరాలుగా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. గతంలో ఉప్పూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పనిచేసి గ్రామ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. నిస్వార్థ సేవకుడుగా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ అధిష్టానం ఆయన సేవలను గుర్తించి ఈ కీలక పదవిని అప్పగించింది. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుండే రమేష్ కు ఈ పదవి దక్కడం సముచితమని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాంబాల రమేష్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పదవి రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులకు మరియు జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS