తెలంగాణ

బాల్కొండ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి ఘనంగా వేడుకలు.

బాల్కొండ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి ఘనంగా వేడుకలు.

పయనించే సూర్యుడుD.02.10.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ మండల పట్టణ కేంద్రంలో ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీవిగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.అనంతరం గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ పట్టణ అధ్యక్షుడు కుందారపు శ్రీనివాస్ గాంధీజీకి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మొహమ్మద్ యూనూస్, సంజయ్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు గడ్డం రవి,మండల కార్యదర్శులు నల్లూరి హరికృష్ణ, పుప్పాల విద్యాసాగర్, పుల్లాయి నవీన్ కుమార్, మార పురుషోత్తం,పిట్ల దయాకర్,సయ్యద్ రియాజ్, బాల్కొండ గ్రామ ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్, మండల యూత్ ఉపాధ్యక్షుడు విక్కీ, మర్కజ్ కమిటీ అ అధ్యక్షుడు మజారుద్దీన్, బాల్కొండ మాజీ ఉపసర్పంచ్ వాహబ్, దివాన్ వెంకటేష్, షేరు, పిప్పర అశోక్, ఆరిఫ్, మేకా నాగేష్, మేక సతీష్, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గాంధీజీ చూపిన అహింసా మార్గం, సత్యం, సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS